Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మద్యం దుకాణాలలో అవినీతికి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు

ఎస్ ఇబి అసిస్టెంట్ కమిషనర్ వి. రేణుక

ఉండి: ప్రభుత్వ మద్యం దుకాణాలలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్ ఇ బి అసిస్టెంట్ కమిషనర్ వి. రేణుక హెచ్చరించారు. గణపవరం రోడ్డులో ఉన్న ఉండి మద్యం దుకాణంలో 21 ఫుల్ బాటిల్స్ లో నీళ్లు కలిపి అమ్మిన బాటిల్స్ ను సీజ్ చేసి ఈ అక్రమాలకు పాల్పడిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉండి లిక్కర్ గోడౌన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేణుక మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేసిన వారు ఎవరైనా అధిక రేట్లకు అమ్మిన అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం దుకాణాల్లో అవినీతికి తావు లేదని ప్రభుత్వం అందించిన మద్యం ప్రజలకు చేరాలని అందులో ఎటువంటి అవకతవకలు జరిగిన ఉపేక్షించేది లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 6 షాపులపై దాడులు చేయడం జరిగిందని అందులో అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉద్యోగం నుండి తీసివేయడం జరుగుతుందని తెలిపారు. వారిని రిమాండ్ కు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పర్యవేక్షకులు శ్రీలత, విజిలెన్స్ సిఐ ఆర్ వి రామశివ, అసిస్టెంట్ ఎక్సైజ్ పర్యవేక్షకులు సత్యనారాయణ రావు, డిపో సిఐ ప్రకాష్, డిపో బలరాం రాజు, ఎక్సైజ్ ఎస్ ఐ ఉమామహేశ్వరరావు, సుధీర్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img