Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

సామాజిక మాధ్యమాలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

బుట్టాయిగూడెం: సామాజిక మాధ్యమాలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పోలవరం డిఎస్ పి లతా కుమారి అన్నారు. సోమవారం స్థానిక డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ మర్రి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులకు పలు అంశాలలో ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుల పట్ల శ్రద్ధ వహించి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. పెరిగిన సాంకేతికత వల్ల సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని దాని ఉపయోగంలో లేనిపోని ఇబ్బందులు తెచ్చుకో వద్దన్నారు. సెల్ ఫోన్, సోషల్ మీడియా ద్వారా ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చక్కటి విద్యాభ్యాసాన్ని అలవర్చుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బుట్టాయిగూడెం ఎస్ ఐ ఎం జయబాబు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ఎస్ అక్కులన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img