Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

చిన్న పరిశ్రమల అభివృద్ధికి చేయూత

ఎపి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంక రవీంద్ర

రాజమహేంద్రవరం: ప్రభుత్వ ఆర్థిక సహకారం తీసుకొని చిన్న పరిశ్రమలు అభివృద్ధిలోకి రావాలని ఎపి ఎంఎస్ఎన్ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంక రవీంద్రనాథ్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిశ్రమల కేంద్రం రాజమహేంద్రవరంలో చిన్న పరిశ్రమల గ్రూపు సభ్యులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవీంద్రనాథ్ మాట్లాడుతూ గ్రాఫైట్ క్రూసిబుల్స్, సిరామిక్, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ రంగాలలో విశేషమైన అభివృద్ధికి తూర్పుగోదావరి జిల్లాలో అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ముఖ్యంగా గ్రాఫైట్ , సిరామిక్ రంగంలో సంప్రదాయ ఉత్పత్తి దారులు ఇక్కడఉన్నారన్నారు. ఇప్పుడు వీరందరూ ఆధునిక పద్ధతులను అనుసరించాలని రవీంద్ర నాథ్ అన్నారు .వీరితో పాటు జీడిపప్పు ప్రాసెస్ దారులు , ఫర్నిచర్ తయారీదారులు , ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ తయారుదారులు , స్టోన్ క్లస్టర్ రంగాలలోని పరిశ్రమల వేత్తలకు కూడా , ప్రభుత్వం ప్రోత్సాహాలు, సౌకర్యాలు రవీంద్ర నాథ్ వివరించారు .ముఖ్యమంత్రి జగన్ చిన్న పరిశ్రమల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు.
త్వరలోనే తగిన అప్లికేషన్స్ తో ముందుకు వస్తామని వివిధ పరిశ్రమల గ్రూప్ సభ్యులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల జిల్లా జనరల్ మేనేజర్ బి వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ , సిరామిక్ప రిశ్రమల రంగాల నుండి ఏ జార్జ్ బాబు , గ్రాఫైట్ రంగాలనుండి వీ జగదీష్ బాబు , ఏ భాస్కర రావు స్ సత్యనారాయణ తతదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img