Monday, September 26, 2022
Monday, September 26, 2022

స్వాతంత్రోద్యమకారులకు పుట్టినిల్లు తణుకు

ప్రముఖ పారిశ్రామికవేత్త వంక రవీంద్రనాథ్

విశాలాంధ్ర – తణుకు: ఎందరో స్వాతంత్ర ఉద్యమకారులకు తణుకు పుట్టినిల్లుని ప్రముఖ పారిశ్రామికవేత్త, హెయిర్ ఇండస్ట్రీస్ అధినేత,ఎపి ఎంఎస్ఎస్ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంక రవీంద్రనాథ్ అన్నారు.ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ పరిశ్రమ కార్మికులు, యాజమాన్యం కలసి జాతీయ జెండాలతో పట్టణంలోని ప్రధాన రహదారులలో ఊరేగింపు నిర్వహించారు . ఈ సందర్భంగా వంక రవీంద్ర నాథ్ మాట్లాడుతూ తణుకు పట్టణానికి, స్వాతంత్రోద్యమానికి, చారిత్రక సంఘటనలు ఉన్నాయన్నారు . 1929 నుండి 1933 సంవత్సరం మధ్యకాలంలో బాపూజీ తణుకు పట్టణానికి రెండుసార్లు వచ్చారన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఎర్రమిల్లి రామనాథం ఇంటిలో ఉద్యమ కారులకు భోజన సౌకర్యాలు ఏర్పాటులో, షెడ్యూల్ కులాల అభివృద్ధికి చేయవలసిన కార్యక్రమాలపై చర్చలు నిర్వహించిన చరిత్ర ఉందన్నారు. మహాత్మా గాంధీ ఈ ఇంటినుండి కార్యాచరణ చేశారని రవీంద్ర నాథ్ అన్నారు . వీరితో పాటు కొండా వెంకటప్పయ్య, మంగిపూడి పురుషోత్తమ శర్మ, మూడుగంటి జగ్గన్న శాస్త్రి, బంధ వియన్నా, శనివారపు సుబ్బారావు, వంటి అగ్ర నాయకులు తణుకు కు చెందినవారన్నారు.వంక సత్యనారాయణ , భూపతిరాజు సుబ్బరాజు , కాట్రావుపల్లి సుబ్బారావు , సంక్రాంతి సుబ్బారావు తదితర యువనాయకులు స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలు జీవితం కూడా అనుభవించారని తెలిపారు. ఆనాటి నాయకుల నిష్కల్మషమైన ఆలోచన , నిస్వార్ధ ప్రవర్తన ప్రజలకోసం స్వంత సుఖాలను త్యాగం చేయటం లాంటి ఉన్నత వ్యక్తిత్వాలను నేటి యువతరానికి తెలియపరచాలని, సమాజం ఎడల మరింత భాద్యతగా ఉండేలా అందరం కలసి ముందుకు సాగాలని రవీంద్ర నాథ్ పిలుపునిచ్చారు. . ప్రధాన మంత్రి మోడీ , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును అందరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంగిశెట్టి వీరన్న, ఎగ్జిక్యూటివ్ అధికారులు దాసిరెడ్డి కిరణ్ కుమార్ , వీరాజు శివ , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img