Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ముంపు ప్రాంతాల ప్రజలకు టిడిపి సహాయం

పాలకొల్లు: టిడిపి నాయకులు, కార్యకర్తలు సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కంచుస్తంభంపాలెం, బూరుగుపల్లి ఏటిగట్టు పక్కనున్న ముంపు ప్రాంతాల ప్రజలకు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ల చేతుల మీదుగా మంగళవారం సహాయం అందించారు. ఈ సందర్భంలో కంచుస్తంభం పాలెంలో 9 మందికి, దొడ్డిపట్ల గ్రామంలో 42 మందికి, ఏటి గట్టున లోపల ఉన్న వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందించలేదని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు గుర్తించారు. సహాయం అందేలా చూడాలని బాధితులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు మొరపెట్టుకున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం ఏ ఒక్క కార్డు ఆగడానికి వీల్లేదనీ తహసిల్దార్ కి చెప్పామన్నారు. 100 కి 100శాతం పూర్తి చేయమని సూచించామన్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వ సాయం అందించక పోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థ గా, వరద ముంపు బాధితులకు మేము అండగా ఉండి సహాయం చేస్తుంటే, ప్రభుత్వ పరంగా మీరు ఎందుకు మీ సహాయం అందించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఏటిగట్టు లోపల ఉన్న వారంతా దళిత, మత్స్యకార కుటుంబాలు వారేనని, వారికి వరద సాయం అందించక పోవడం అన్యాయం అని ఎమ్మెల్యే అన్నారు. దొడ్డిపట్లలో 42, బూరుగుపల్లి లో 9 మంది కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేదంటే సహాయం అందని 51 కుటుంబాలను తీసుకుని తహసిల్దార్ కార్యాలయానికి వెళ్తామని అక్కడ కూడా న్యాయం జరగకపోతే వారితో కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి నిరసన తెలియజేస్తామని ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ టిడిపి వారికి అండగా ఉంటుందన్నారు . ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img