Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జికే టిడిపి టిక్కెట్టు కేటాయిస్తాం

పొత్తులపై అపోహలొద్దు…

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి….

జోన్-2 ఇన్ఛార్జి, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడి….

విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ టిడిపి టిక్కెట్టును వలవల బాబ్జికే టికెట్ కేటాయిస్తామని జోన్ 2 ఇన్ఛార్జి, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం స్థానిక మాగంటి కళ్యాణమండవంలో నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జి వలవల బాబ్జి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ టిడిపి రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రతిపక్ష పార్టీలతో పొత్తులు ఉంటాయని దీనివల్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టిడిపి టిక్కెట్టు రాదని కార్యకర్తల్లో అపోహలు ఉ న్నాయని తెలిపారు. ప్రతీ కార్యకర్త అపోహలు విడనాడి పార్టీ గెలువునకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉండగా వలవల బాల్జీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాంటి నాయకుడికి టిక్కెట్టు ఇచ్చేందుకు పార్టీ ముందుంటుందన్నారు. ప్రస్తుతానికి ఇతర పార్టీలతో పొత్తులు లేవని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షంలో ఉన్న ఇతర పార్టీలు తమతో కలిసి ముందుకు అధిష్టాన ఆదేశం మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో ముఖ్యమంత్రి జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు.
పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉద్యోగులు చూపిన వ్యతిరేకత ప్రభుత్వం ఆలోచనలో పడిందన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రతీ కార్యకర్త ధైర్యంతో ముందుకు వచ్చి కష్టపడి పనిచేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్నారు. సంబరాలు చేసుకుంటే సరిపోదని కష్టపడి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. బిజెపి వైసిపి పార్టీల్లో ఉన్న లోపాయికార పొత్తుపై జగన్ స్పష్టత రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ జగన్ పై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల రోడ్డునపడుతున్నాయని తెలిపారు.ముందుగా ఎన్.టి.ఆర్. విగ్రహానికి పూలమాలలు వేశారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి పోతులు అన్నవరం, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలోశనగన రాంబాబు, వరలక్ష్మీ, సర్పంచ్లు తాడేపల్లి బేబి, పిల్లా రాంబాబు, ముత్యాల సత్యనారాయణ కార్యకర్తలు, ఎంపీటీసీలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img