విశాలాంధ్ర-కాళ్ళ: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని ఉండి మాజీ ఎం.ఎల్. ఏ వేటుకూరి శివ రామరాజు అన్నారు.మండలం లోని పెదమిరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్.టి.ఆర్.విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి ,ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని ఇనుమడింప చేసి అనేక మందికి మార్గం చూపిన వ్యక్తి అన్నారు.పేదలకు రూ.2 లకే కె.జి బియ్యం ఇచ్చి సంచలనం సృష్టించారన్నారు.వారి మార్గం లో నేడు చంద్రబాబు పయనిస్తూ తెలుగుదేశం దిశ దిశల వ్యాపింప జేశారన్నారు.ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తోట ఫణి,కె.వి.వెంకట కృష్ణ,అలుగు.సెబాస్టియన్, గండి.నంది రాజు,కోణాల కర్ణేలు,వేగేశ్న మురళి కృష్ణంరాజు, ముందుండి రాజేష్,ఆముదాలపల్లి వీర బ్రహ్మశీ,కందుల పల్లపురావు,
మన్నే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.