Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కౌలు రైతులుకు ప్రభుత్వంగుర్తింపు కార్డులుఇవ్వాలి

కోవూరు, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం మండలప్రధమ మహాసభ పట్టణంలోని సీతా పోలయ్య భవనంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి గంటా లక్ష్మీపతి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 40 లక్షల కుటుంబాలు వ్యవసాయం సాగు చేస్తుండగా అందులో రెండు లక్షల కుటుంబాలు కౌలు రైతు లేన న్నారు .70 శాతం భూమి కౌలు రైతుల ద్వారానే సాగవుతుందని చెప్పారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహాలు లేక నష్టాలతో వ్యవసాయం సాగు చేస్తున్నాయన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పట్టించుకోవడంలేదన్నారు. కౌలు రైతులకు రక్షణ లేకుండా పోయిందని కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వకుండా బ్యాంకు నుండి పంటలకు రుణాలు మంజూరుచేయక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు . కౌలు రైతులకు విత్తన సబ్సిడీ పంట నష్ట పరిహారం అందేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మండలి కమిటీ తొమ్మిది మంది తో ఏర్పడింది. మండల కమిటీ కార్యదర్శగా బుజ్జయ్య కార్యనిర్వాహక సభ్యులు గా రమేష్, సురేంద్ర, సుబ్బారావు,సర్దార్,కృష్ణ య్య,శ్రీనివాసలు,సురేష్,ప్రసాద్, శివ ఎంపికయ్యారు.

మాట్లాడుతున్న సీపీఎం మండల కమిటీ కార్యదర్శి గండవరపు శేషయ్య.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img