Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

కౌలురైతులు పంట సాగుదారు హక్కుపత్రాలు పొందాలి

విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్ :వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులందరూ రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట సాగు దారు హక్కు పత్రాలను పొందాలని మండల వ్యవసాయ అధికారి ఆర్.ఎస్.ప్రసాద్ తెలిపారు. గురువారం కడియద్ద గ్రామంలో ఆయన నారుమళ్ళను రైతులతో కలిసి పరిశీలించారు. నారుమళ్ళ సస్య రక్షణకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఆర్.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ కౌలు రైతులందరూ గ్రామాల్లోని ఆర్.బి.కె. కేంద్రాల్లో, విఆర్వోల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకుని ఈనెల 30లోగా పంటసాగు హక్కు పత్రాలను పొందాలని అన్నారు. పత్రాలు పొందడం ద్వారా కౌలు రైతులకు విపత్తుల సమయంలో సబ్సిడీ, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పధకాలు లభిస్తాయన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్, ధాన్యం అమ్మే ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. కౌలు రైతులకు ఈ పత్రాలు పొందడం ద్వారా రుణాలు కూడా లభిస్తాయని తెలిపారు. మండలంలో 26 వేల ఎకరాల్లో సార్వా వరిసాగు చేసేందుకు అవకాశం ఉందని అంచనా వేశామని తెలిపారు. ఇప్పటికే 398 ఎకరాల్లో నారుమళ్ళు వేశారని తెలిపారు. పట్టింపాలెం, అప్పారావుపేట, పుల్లాయిగూడెం, వెంకట్రావుపాలెం, కొమ్ముగూడెం తదితర గ్రామాల్లో సుమారు 18 హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.బి.కె. ఇన్ఛార్జి మువ్వ వీర్రాజు, రైతులు దారపురెడ్డి మాణిక్యాలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img