Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

స్మశాన వాటికను డంపింగ్ యార్డ్ చేసేసారు

విశాలాంధ్ర – ఉండి:స్మశాన వాటికను డంపింగ్ యార్డ్ గా చేసేసారని వైసిపి ఉండి పట్టణ మాజీ అధ్యక్షులు రాయి సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు.ఉండి మండలం ఉండి నుండి ఉప్పుగుంట వెళ్లే మార్గంలోని స్మశాన వాటికను ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉండి గ్రామానికి చెందిన రాయి సతీష్ సోమవారం జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాయి సతీష్ విలేకరులకు వివరాలను అందజేశారు. ఉండి నుండి ఉప్పుగుంట వెళ్లే మార్గంలోని స్మశానం సుమారు 10 ఎకరాల గ్రామకంఠం భూమి ఉందని ఆ భూమిని ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసన వలన ఉప్పుగుంట వెళ్లే ప్రజలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వలన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయవలసి వచ్చిందన్నారు. ఉండి గ్రామపంచాయతీ వారు గ్రామంలో సేకరించిన చెత్తను రోడ్డుకు ఇరువైపులా పోయడమే కాకుండా స్మశాన వాటికను మొత్తం ఆక్రమించారని ఆయన ఆరోపించారు. స్మశాన వాటికను ఆక్రమించడం వలన ఆ ప్రాంతంలో మృతదేహాలను దహన సంస్కారం చేయడానికి, పూడ్చివేయడానికి మృతుని తరపు వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఏప్రిల్ నెలలో వచ్చే క్రైస్తవుల పవిత్ర పండగ అయిన ఈస్టర్ ను పురస్కరించుకుని స్మశాన వాటికను బాగు చేయించాలని స్మశాన వాటికను పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులతో సర్వే చేయించి స్మశాన వాటికకు ఉన్న సుమారు పది ఎకరాలు భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆయన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img