Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

పంచాయితీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి….

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి….

విశాలాంధ్ర ఉండి: పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉండి మండలం కలిసిపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పంచాయితీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు పంచాయతీల సర్పంచులు, 28 వార్డు మెంబర్లుకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలను ఈ నెల 19వ తేదీన నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించడం జరుగుతుందన్నారు. కలిసిపూడి పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ లోపలికి, బయటికి రాకపోకలకు వీలుగా అదనపు ద్వారంను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంలో జిల్లా పంచాయతీ అధికారి జివికె మల్లికార్జునరావు, పంచాయతీ ఎన్నికల జిల్లా నోడల్ అధికారి ఎన్ వి ఎస్ శివ ప్రసాద్ యాదవ్, ఎంపీడీవో ఎ.వి అప్పారావు, ఇంచార్జ్ తహాసిల్దార్ ఎస్.వి.ఎస్ నాయుడు, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img