Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భీమవరంకు ఇది ఒక చరిత్ర

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

భీమవరంటౌన్ : భీమవరం జిల్లా కేంద్రం కావడం రాజకీయాల్లో ఒక చరిత్ర అయితే, నూతనంగా ఏర్పడిన కలెక్టరేట్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం మరో ఘన చరిత్ర అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాల పునర్ విభజన లో భాగంగా నరసాపురం పార్లమెంట్ పరిధి లోని ఏడు నియోజకవర్గాలను కలిపి నూతన పశ్చిమగోదావరి జిల్లాగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్, భీమవరం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా మంజూరు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు.
పట్టణానికి జిల్లా కేంద్రం తీసుకురావడానికి రాజకీయంగా కొన్ని త్యాగాలు చేసినప్పటికీ, తన హయంలో జిల్లా కేంద్రం వచ్చింద నే సంతృప్తి శాశ్వతంగా తన మదిలో ఉంటుందన్నారు. భీమవరం పట్నం జిల్లాకు నడి బొడ్డున ఉండటమే కాకుండా విద్య, వైద్య, వ్యాపార రంగాలతో పాటుగా ఆక్వా రంగానికి కూడా భీమవరం ప్రసిద్ధిగాంచిందని తెలిపారు. భీమవరం పట్టణానికి జిల్లా కేంద్రం మంజూరు కావడం తో కలెక్టరేట్ ,ఎస్ పి కార్యాలయంతో పాటుగా మిగిలిన అన్ని శాఖల జిల్లా కార్యాలయాలను, జిల్లా అధికారులను ఏడు నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ పి ప్రశాంతి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా పెద్ద ఎత్తున జరగడం, ఈ వేడుకలను చూడటానికి ప్రజలు తరలిరావడం, విద్యార్థులు పలు సాంస్కృతి కార్యక్రమాల ప్రదర్శనలు ఇవ్వడం, జిల్లాలో పనిచేసినటువంటి ఉత్తమ అధికారులకు, సిబ్బందికి సేవ పురస్కారాలు అందించడం ఇవన్నీ చూస్తుంటే తన మనసు ఎంతో సంతోషించిందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img