Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఇదీ మార్టేరు బస్సు షెల్టర్

పెనుమంట్ర:ఆచంట నియోజకవర్గనికే ప్రధాన కూడలి అయిన మార్టేరు సెంటర్ నుండి ఇతర గ్రామాలకు వెళ్లేందుకు నిత్యం వందల మంది ప్రయాణికులు, వర్తకులు, విద్యార్థులు, బస్సుల కోసం నడి రోడ్డుపై నిరీక్షించ వలసిందే. బస్సు కోసం ఎండలో రోడ్డు ప్రక్కనే వేచి ఉండవలసి వస్తున్నది. కొద్దిపాటి వర్షం కురిసినా తల దాచుకునేందుకు చోటు లేక లగేజీలు, పిల్లాపాపలతో ఎన్నో అవస్థలు పడవలసి వస్తున్నది. ఈ గ్రామానికి చుట్టుపక్కల పలు విద్యాసంస్థలు ఉండడంతో విద్యార్థులు, ఉద్యోగులు మార్టేరు సెంటర్లోనే బస్సు ఎక్కాలి. ఆర్టీసీ బస్సుల కోసం రోడ్డుపైన నిలబడాలి. బస్సు షెల్టర్ లేకపోవడంతో ఇక్కడ ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్ అంటూ ముఖ్యమంత్రి జగన్ బొమ్మతో పెద్ద ఫ్లెక్సీ తో ఏర్పాటుచేసిన ఈ బస్సు షెల్టర్ ఆకులు లేచిపోయి, కర్రలు కనిపిస్తూ ఎవరికి ఎటువంటి నీడ ఇవ్వలేని దుస్థితిలో ఉంది. అయినప్పటికీ గత్యంతరం లేక ప్రయాణికులు బస్సుల కోసం తాటాకుల పందిరిలో వేచి ఉంటున్నారు. మార్టేరు గ్రామంలో బస్టాండ్ నిర్మాణం అందాన్ని ద్రాక్షగా మిగిలిపోయింది. ఇకనైనా ప్రజా రవాణా శాఖ ఈ సమస్య త్వరలోనే పరిష్కరించాలని ఆచంట నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img