Monday, May 29, 2023
Monday, May 29, 2023

పారదర్శకంగా పౌష్టిక ఆహారం పంపిణీ

విశాలాంధ్ర – కొయ్యలగూడెం: రాష్ట్ర ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించి తద్వారా మెరుగైన సమాజం నిర్మించే దిశగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తున్నారని ఫుడ్ కమిషన్ మెంబర్ గంజి మాలా దేవి అన్నారు. మంగళవారం అమరావతి లోని ఫుడ్ కమిషన్ కార్యాలయంలో అభిమానులు ఉద్యోగుల మధ్య గంజి మాలాదేవి ఫుడ్ కమిషన్ సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతికి తావులేంకుండా సక్రమంగా పేదలకు బడగు బలహీన వర్గాల ఆహరాన్ని అందించే విధంగా కృషి చేస్తానని ఫుడ్ కమిషన్ సభ్యులు గంజి మాలాదేవి అన్నారు. రాష్ట్రంలో ఫుడ్ కమిషన్ లో నాలుగు విభాగాలు గా ఉన్నాయని ఆ నాలుగు విభాగాలలో అవినీతికి తావు లేకుండా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు పౌష్టికాహారం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం ప్రభుత్వం నుంచి వచ్చే సరుకులు అందరికీ సరఫరా అయ్యేలా ముఖ్యమంత్రి జగన్ లక్ష్యానికి అనుగుణంగా ఆయన నాపై ఎంత నమ్మకంతో ఈ గురుతరమైన బాధ్యతను నాకు అప్పగించారన్నారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ కార్యక్రమాలు అందాల చూస్తానని అన్నారు. పౌష్టికాహారం, బాలామృతం గర్భిణీ స్త్రీలకు బిడ్డలు ఎదుగుదలకై సమతుల్యమైన ఆహారం సరఫరా చేస్తామన్నారు. హాస్టల్ లో తన తనిఖీ చేస్తూ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరైన మోతాదులతో అందుతుందో లేదో తనిఖీ చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లల ఆహారం దళారులకు అందకుండా విద్యార్థులకు సక్రమంగా అందాల అనే చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో కలసి నిర్మాణాత్మకంగా పని చేస్తామన్నారు. ఈ పదవి రావటానికి కారణమైన ముఖ్యమంత్రి జగన్ కి, చైర్మన్ విజయ ప్రతాప్ కి, ఏ ఎస్ ఓ కి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img