విశాలాంధ్ర- ఏలూరు: ఆంధ్ర ప్రదేశ్ లో ఎంఎస్ఎంఈ అభివృద్ధికి వంక రవీంద్ర నాథ్ చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ కొనియాడారు. శుక్రవారం విజయవాడ ముత్యాలంపాడులోగల ఎంఎస్ఎంఈ ప్రధాన కార్యాలయంలో నూతన చైర్మన్ ఆడారి ఆనంద్ భాద్యతలు చేపట్టి కార్యక్రమంలో రవీంద్ర నాథ్ ఇప్పటి వరకు చేసిన పనులను మననం చేశారు. రవీంద్ర నాథ్ చేసిన కృషిని అభినందింస్తూ ఘనంగా సన్మానించారు. ఇండస్ట్రియల్ డైరెక్టర్,ఎంఎస్ ఎంఈ సీఈఓ సృజన మాట్లాడుతూ తొలిసారి చైర్మన్ గా భాద్యతలు చేపట్టి నప్పటునుండి రవీంద్రనాథ్ నిరంతరం ఎం ఎస్ఎంఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అవగాహనా వచ్చేలా చేసిన కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ తనకు ఈశాఖ లో పనిచేయడం పూర్తి తృప్తి కలిగిందని ,తన పదవి కాలం ముగిసినా రాష్ట్ర అభివృద్ధి కోసం నూతన చైర్మన్ కు తన పూర్తి సహకారం అందిస్తానన్నారు. శిక్షణ కేంద్రాలు విజయవాడలో పెట్టే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని , త్వరలో ఈ కేంద్రం ద్వారా అనేక మంది శిక్షణ పొంది సాంకేతిక ఉద్యోగాలు పొందవచ్చని రవీంద్రనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసన సభ్యులు అదీపు రాజా, చోడవరం శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ, సంస్థ డైరెక్టర్ ఎస్. నదయ ,భీమవరపు విజయ లక్ష్మి, జి.వరలక్ష్మి,ఎం.శారద, ఆంజనేయులు, బదరీనాథ్ పాల్గొన్నారు.