Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

దేశం కోసం పోరాడిన త్యాగమూర్తులను మననం చేసుకోవాలి

కాళ్ళ: దేశం 75 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఈ దేశం కోసం పోరాడిన త్యాగమూర్తుల త్యాగాలను మననం చేసుకోవాలని ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డా. ఎసి ఎస్ వి ప్రసాద్ అన్నారు. పెద అమరం గ్రామంలో ఎంపీపీ ప్రధాన ప్రాథమిక పాఠశాలలో ఆజాదీకా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉన్నత భారత అభయాన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రతినిండా జాతీయ జెండా రెపరెపలాడేలా చేయాలన్నారు. యుబిఎ కన్వీనర్ డా. ఎం గణేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రగతికి ప్రజలలో చైతన్యం కోసం మార్గ నిర్దేశం అందించేందుకు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రధాని మోడీ యుబిఎ సెల్ ఏర్పాటు చేయించారని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈ ప్రసన్నభారతి మాట్లాడుతూ యుబిఎ సెల్ ద్వారా విద్యార్థులలో చైతన్యం కలిగించేందుకు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల
యుబిఎ సెల్ ప్రొఫెసర్ల బృందాన్ని అభినందించారు. అనంతరం విద్యార్థులకు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. ఆర్ సుబ్బారావు, డా. పి రఘురాం, డా. టి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img