Friday, April 19, 2024
Friday, April 19, 2024

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఎంపిపి గంజిమాల రామారావు

కొయ్యలగూడెం: మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మార్చటం ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని ఎంపీపీ గంజిమాల రామారావు తెలిపారు. కొయ్యలగూడెం మండలంలో 5 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించటానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం ఇందుకు సంబందించిన అధికారులతో ఎంపిపి రామారావు సమీక్షించారు. 75 సంవత్సరాల స్వాత్రంత్య సంబరాలు సందర్భంగా మహిళలను పేదరికం నుంచి సాతంత్ర్యం కల్పించటానికి ఆగస్టు 15 న ఈ పాజేక్టు ప్రారంభించాలని ఎం.పి.పి ఆకాంక్షించారు. ఆ మేరకు జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్ ద్వారా మండలంలో 10 మహిళా గ్రూపులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దాల్సి ఉందన్నారు. తొలుత ఐదు గ్రామాల్లో పైలట్ గా అమలు పరచటానికి సిద్దం చేయాలని చెప్పారు. ఆయా గ్రామాల్లో ఏయే అంశాలు పట్ల మహిళలకు ఆశక్తి ఉన్నదో గుర్తించాలని సూచించారు. ఆశక్తిని బట్టి ఒక్కో గ్రామానికి 5 నుంచి 10 మహిలను గుర్తించి ఆగస్టు 5వ తేదీలోపు వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఇందుకు సంభందించిన పాజెక్టు రిపోర్టు రూపొందించాలని వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ సుబ్రమణ్యాన్ని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ఎంపికైన మహిళలకు స్త్రీనిది ద్వారా గాని, జీవనోపాదుల మిషన్ ద్వారా గాని, ఆంద్ర ప్రదేశ్ ఆహార శుద్ధి సంస్థ ద్వారా గాని రుణ సదుపాయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీవనోపాదుల మిషన్ జిల్లా కొ ఆర్డినేటర్ విజయకుమారితో నేరుగా మాట్లాడి ఈ పైలట్ ప్రాజెక్టు వెంటనే ప్రారంభించటానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు ఆర్ధిక స్వావలంభన సాధించటానికి ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సూచించారు. ఎంపికైన గ్రామాల్లో సి.ఎ లు త్వరితగతిన వివరాలు సేకరించేలా క్లస్టర్ కొ ఆర్డినేటర్ మానిటరింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కొ ఆర్దినేటర్ సునీల , సిఏ లు బందుల జయమ్మ, వెంకట లక్ష్మి, రత్న కుమారి , విజయ లక్ష్మి,సుజాత పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img