Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మాలకొండ అన్నదాన క్షేత్రంలో మహిళలు స్వచ్చందంగా సేవలు

విశాలాంధ్ర వలేటివారిపాలెం. రాష్ట్రంలో ప్రముఖపుణ్యక్షేత్రంలో ఒకటైన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వివిధ రాష్ట్రాలనుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి తమమొక్కలు తీర్చుకొంటున్నారు.ఈ దేవస్థానం లో దర్శనసేవలన్నీ ఒక శనివారం మాత్రమే ఉంటాయి అందువల్ల భక్తులు అధికసంఖ్యలో దేవస్థానంనకు వచ్చే భక్తులకు నిర్వాహకులు సేవలు అందిస్తుంటారు ఈ నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు వలేటివారిపాలెం మండలంనకు చెందిన మహిళలు స్వచ్చందంగా సేవలు అందిస్తుంటారు శనివారం దేవస్థానంలోని అన్నదానసత్రంలో భక్తులకు అన్నదానం వడ్డించడం కష్టమైన అంశం ప్రతి శనివారం స్వామి దర్శనానికి 10వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్చించుకొంటారు.ఈ ఉచిత అన్నదానసత్రంలో సుమారు 4వేల మందికి పైగా భక్తులకు ఉదయం 10.30గంటలనుంచి సాయంత్రం 4గంటలవరకు అన్నదానకార్యక్రమం జరుగుతుంది.ఈ అన్నదానకార్యక్రమంలో మహిళలు స్వచ్చందంగా స్వామి సన్నిధిలో 10నుంచి 15మంది మహిళా సేవకులు ఉచితంగా సేవలు అందిస్తున్నారు.ఈ దేవస్థానం లో సన్నిధిలో స్వచ్చందంగా ఆధ్యాత్మిక చింతనతో వచ్చే సేవకులకు ఆలయకార్యనిర్వాహణాధికారి కె బి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు స్పందించి దేవస్థానంకు వచ్చే భక్తులకు మహిళా భక్తులు స్వచ్చందంగా సేవలు అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img