Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యుత్ స్తంభాల చుట్టూ తీగలు..ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్లు

విద్యుత్ స్తంభాల చుట్టూ తీగలు..ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్లు

- Advertisement -

విశాలాంధ్ర – చిలమత్తూరు: మండల పరిధిలోని దేమకేతేపల్లి పంచాయతీ వై.గొల్లపల్లి గ్రామంలో విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యానికి విద్యుత్‌ స్తంభాలు నిలువెత్తు నిదర్శనంగా మారాయి. పలు విద్యుత్‌ స్తంభాలకు పచ్చని తీగలు చుట్టుముట్టడంతో విద్యుత్‌ లైన్లు ప్రమాదకరంగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై విద్యుత్‌ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ స్తంభాలు, తీగలు ఉన్న ప్రాంతంలో నిత్యం పశువుల కాపరులు, రైతులు, పాదచారులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని, ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలకు పచ్చని తీగలు తగిలితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పచ్చని తీగలు విద్యుత్‌ తీగలను తాకడంతో తరచూ షార్ట్‌ సర్క్యూట్‌ అవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఇళ్లకు, బోరు బావులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. మారుమూల గ్రామం కావడంతో సమస్యను పరిష్కరించకుండా తరచూ విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని వారు వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన విద్యుత్‌ స్తంభాలు, తీగలను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, గ్రామానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించాలని వై.గొల్లపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు