Homeజిల్లాలుఅనంతపురంనార్పల మండల అభివృద్ధే మా ప్రధాన ధ్యేయం

నార్పల మండల అభివృద్ధే మా ప్రధాన ధ్యేయం

- Advertisement -

– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల అభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో జెడ్పీటీసీ అభ్యర్థి శివానందరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి ఎన్. స్వాతిలతతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనr మాట్లాడారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నార్పల మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సత్యనారాయణరెడ్డి తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండున్నరేళ్లలో మండలంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.మండలంలోని యువతలో కొందరు చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాలకులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. మండల అభివృద్ధి, యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించాలంటే ప్రజలు తమ ఓటు ద్వారా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.జెడ్పీటీసీ అభ్యర్థి శివానందరెడ్డి మాట్లాడుతూ నార్పల మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిపిస్తే మండల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
ఎంపీపీ అభ్యర్థి ఎన్. స్వాతిలత మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత, పేద కుటుంబాల సమస్యలకు ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ముందుంటానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరారు.
ఈ సందర్భంగా నార్పల మండలంలోని జెడ్పీటీసీతో పాటు అన్ని ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు