Monday, May 20, 2024
Monday, May 20, 2024

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు: సబ్ కలెక్టర్ అహ్మద్ ఖాన్

సబ్ కలెక్టర్ కార్యాలయంలో అట్టహాసంగా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -రాజంపేట: అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సబ్ కలెక్టర్ పర్వాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. గురువారం రాజంపేట సబ్ కలెక్టర్ ప్రాంగణంలో అట్టహాసంగా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా ఎన్సిసి క్యాండేట్ల గౌరవ వందనన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలు మరువలేనివి అన్నారు. దేశంలోని అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రతి పౌరుడు మహనీయుల అడుగుజాడల్లో నడవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు ఈ వేడుకల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శనల రూపంలో ప్రదర్శించారు.దేశభక్తి నృత్యాలు, పిరమిడ్ విన్యాసాలు, సైనిక కవాతులు, దృశ్యరూపక ప్రదర్శనలు, చూపరులను ఎంతో ఆకర్షింప చేశాయి. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు చేసిన నృత్యం కార్గిల్, కాశ్మీర్ పై పాకిస్థాన్ ఉగ్రవాదులని తిప్పికొట్టిన కొందరు వీరజవాన్ల మృతితో వీరజవాన్ల కుటుంబీకుల వ్యధవంటి దృశ్యరూపక ప్రదర్శనలు అధికార్లను సైతం ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో భాగంగానే విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో శిరీష, పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img