టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవ రెడ్డి
విశాలాంధ్ర – చాట్రాయి : టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు సారధ్యంలో అన్ని నియోజకవర్గాల్లో విజయఢంకా మోగిద్దామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పుట్టినరోజు సందర్భంగా పార్టీ చాట్రాయి మండల కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విజయ మిల్క్ డైరెక్టర్ బొట్టు రామచంద్ర రావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, సీనియర్ నాయకులు పుచ్చకాయల నోబుల్ రెడ్డి, నియోజకవర్గ తెలుగు రైతు కార్యదర్శి మందలపు జగదీష్ , మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు ఊట్ల ధనలక్ష్మి, మండల ఎస్ సి సెల్ అధ్యక్షుడు కల్లేపల్లి ప్రభాకర్, కొత్తగూడెం గ్రామ టిడిపి అధ్యక్షులు వెల్ది నాగేశ్వరరావు, పర్వతాపురం గ్రామ టిడిపి అధ్యక్షులు బోర్ర నాగేశ్వరరావు, మండల పార్టీ కార్యదర్శి కంచర్ల హనుమంతరావు, టిడిపి కోటపాడు నాయకులు బొంతు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.