London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన

విశాలాంధ్ర – పాలకొల్లు : స్థానిక బిఆర్ఆర్ అండ్ జీకేఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల, ఇంపాక్ట్ హెచ్ఆర్ ఆధ్వర్యంలో కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పాలకొల్లు ఎమ్మెల్యే డా. నిమ్మల రామానాయుడు హాజరై, జ్యోతి ప్రజ్వలనతో మెగా జాబ్ మేళా ను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే డా. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత యువశక్తి ఉన్న దేశం భారతదేశం అని, యువత తమ శక్తి యుక్తులను ఉత్పత్తి సేవా రంగాలకు వినియోగించి వ్యక్తిగత దేశ సంపద పెంచగలిగే శక్తి ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు చేసే ఈ ప్రయత్నంలో, పాలకొల్లు ఛాంబర్స్ కళాశాల జిల్లాలోనే ముందు వరుసలో ఉంటుందంటూ కొనియాడారు. కళాశాల యాజమాన్యం దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపటం మన ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలన్నారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్సీ కవురు శ్రీనివాసు మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉద్యోగ అవకాశాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారని వారి ఆశలను ఆశయాలను, కలలను నెరవేర్చేందుకు, కళాశాల వివిధ కంపెనీ హెచ్.ఆర్ లను సంప్రదించి, విద్యార్థులకు, కళాశాలలకు, జాబ్ మేళా వివరాలను వివరించడం, నిర్వహించడం అత్యంత వ్యయ ప్రయాసతో కూడినదన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే సంకల్పం చాలా ఉన్నతమైనదన్నారు. అందుకు చాంబర్స్ కళాశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు.
కళాశాల యాజమాన్యం ముఖ్య అతిథులను దుస్సాలువా, మెమొంటోతో సత్కరించారు. కళాశాల చైర్మన్ మాట్లాడుతూ, నేడు రేపు నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాకు, ఉభయ గోదావరి జిల్లాల నుండి ఒక్క15వ తారీఖున, శనివారం ఒక్క రోజునే 1069 మంది అభ్యర్థులు హాజరైనారని తెలియజేసారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఈ కలిదిండి రామరాజు, ప్రాంగణ ఎంపికలకు విచ్చేసిన అభ్యర్థులకు శుభాభినందనలు తెలియజేసారు. కళాశాల ప్రిన్సిపల్ డా. డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ పిలుపుమేరకు ఉభయగోదావరి జిల్లాల నుండి విచ్చేసిన వివిధ కళాశాల విద్యార్థులకు, వారి యాజమాన్యానికి కృతజ్ఞతలను తెలియజేసారు. ఉద్యోగ నైపుణ్యులైన హెచ్ఆర్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ లాంటివి చక్కగా ప్రదర్శించి ఉద్యోగాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఇంపాక్ట్ హెచ్ ఆర్ ప్రతినిధులు టి. పవన్ కుమార్, ఎస్. మాధవ్ వర్మ ప్రాంగణ ఎంపిక గురించి విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ కె. లక్ష్మణరావు, వోట్ ఆఫ్ థాంక్స్ తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాకు సక్రమంగా జరుగుటకు విద్యార్థి వాలంటీర్లు,అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, కృషి చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లం ఆనంద్ ప్రకాష్, కళాశాల అడిషనల్ చైర్మన్ తట్టపర్తి కృష్ణమూర్తి, చాంబర్స్ కార్యదర్శి దేవరపు లక్ష్మీనారాయణ, ట్రెజరర్ జల్లూరి రామలింగేశ్వరరావు, కళాశాల ఎకడమిక్ అడ్వైజర్ ఎబిఎస్ మూర్తి, గవర్నింగ్ బాడీ మెంబర్స్ సీతారామరాజు, అడబాల రమణ, వి. రంగరాజు , కొరగింజల రవి శంకర్, కేవీఎం ఛాంబర్స్ ప్రిన్సిపల్ టి ఓల్గా, విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img