విశాలాంధ్ర- పెనుకొండ : మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి. మణిపూర్ లో సీఎం ను బర్తరఫ్ చేస్తూ రాష్ట్రపతి పాలన విధించాలని మణిపూర్ లో జరుగుతున్న రావణకష్ట ను మహిళలపై జరుగుతున్న అఘాయిత్యలను వెంటనే ఆపాలని మహిళలకు భద్రత లేకుండా పోతున్నది వెంటనే భారత రాష్ట్రపతి జోక్యం చేసుకొని , ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేస్తూ రాష్ట్రపతి పాలన విధించాలని మణిపూర్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సోమవారం సత్య సాయి జిల్లా పెనుకొండ తహశీల్దార్ సువర్ణ , కి ప్రజా సంఘాలు వినతి పత్రం అందజేశారు.