వన్‌టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలో ఆదివారం రాత్రి సమయంలో వచ్చిన సమాచారం మేరకు ఐసిఐసిఐ బ్యాంకు వెనుక వైపున, బయట ప్రదేశంలో లైట్ల కింద మంగపత్త అను జూదము డబ్బును పణంగా పెట్టి, ఆడుతున్న 9 మంది వ్యక్తులను అదుపులో తీసుకొని అరెస్టు చేయడం జరిగిందని వన్‌టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పేకాట ఆడుతున్న మహేష్ మూర్తి, నరేంద్ర, నారాయణారెడ్డి,వెంకటేష్, భరత్ కుమార్, హరినాథ్, సతీష్, జగదీష్, దుర్గాప్రసాద్ అనే తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద గల నగదు రూ.20,350 రూపాయలను, 54 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పి.. సీఐ సుబ్రహ్మణ్యం ను, సిబ్బందిని అభినందించారు.