విశాలాంధ్ర, కదిరి(శ్రీ సత్య సాయి జిల్లా).. పట్టణంలో బండారు నగర్ లోని కే ఎల్ ఎన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవాన్ని కరెస్పాండెంట్ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు ఏర్పాటు చేసిన విద్య వైజ్ఞానిక ప్రదర్శనల అనంతరం రమేష్ మాట్లాడుతూ సైన్స్ అనేది ఒక శాస్త్రీయ విద్య అని, మన జీవితాన్ని సుఖవంతం చెయ్యడానికి వ్యవసాయం, ఆరోగ్యం వంటి రంగాల్లో పురోగతి సాధించడానికి సైన్స్ ఉపయోగ పడుతుందని తెలిపారు. పకృతిలో దొరికే పదార్థాల గుణాలను ధర్మాలను అర్థం చేసుకొని వాటిని మన మేలుకు సైన్స్ ప్రభావం ఎంతో ఉందని తెలిపారు. తమ పిల్లల చేత విద్య వైజ్ఞానిక ప్రదర్శనకు తోడ్పాటు అందించిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు