Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

అశోక్ బాబును మరో మారు ఆశీర్వదించండి

ఎమ్మెల్యే అశోక్ సతీమణి నీలోత్పల

విశాలాంధ్ర-కవిటి:ఇచ్చాపురం నియోజకవర్గం నుండి ముచ్చటగా మూడోసారి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న ఎమ్మెల్యే బెందాలo అశోక్ ను మరో మారు ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అశోక్ సతీమణి నీలోత్పల కోరారు.ఈ మేరకు గురువారం మండలంలోని నెలవంక పంచాయతీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మూడోసారి డాక్టర్ బెందాళం అశోక్ టికెట్ ప్రకటించినందుకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ఈ మేరకు కొమ్ముపొట్టుగ,మధ్యపుట్టుగ, బైరెడ్లుపుట్టుగ,కోరికాన పుట్టుగ,బదకలపుట్టుగ, సీమూరు,నెలవంక గ్రామంలలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు పరిపాలనకు జగన్ పరిపాలనకి మధ్య వ్యత్యాసం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామంలో గల మహిళలు,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలుగుదేశం విజయానికి సహకారం అందిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బెందాలం తిరుమల,బెందాలం విజయ్ కృష్ణ,బార్ల చినబాబు, మణి చంద్రప్రకాష్,ప్రగడ మణి బాబు,రంగారావు,బల్లెడ శ్రీపతి,రొయ్యి భాగ్యశ్రీ,నెలవంక గ్రామ పంచాయతీలో పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు,సీనియర్ నాయకులు,కవిటి మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్,వివిధ అనుబంధ సంస్థలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img