విశాలాంధ్ర – బెలగాం : పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న డిఐఈఓ కార్యాలయంలో డిఐఈఓ డి. మంజుల వీణ చేతుల మీదుగా ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిఆర్ఈఐఎల్ఎ) డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఈఐఎల్ఎ స్టేట్ ట్రెజరర్ గణపతి నాయుడు, అధ్యాపకులు జాగాన శ్రీనివాసరావు, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ సభ్యులు ఆకుల రాజు, తెర్లి రవికుమార్, అధ్యాపకులు తెర్లి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.