భూ పోరాటంతో పేదలవంటే సిపిఐ
- ఈ స్థలం మనది ఎవరూ కూడా అధైరవద్దండి
- * సిపిఐ డివిజన్ కార్యదర్శి మధు
- విశాలాంధ్ర- బత్తలపల్లి: పేదలకు పట్టాలిచ్చే వరకు కూడా సిపిఐ మీ వెంట ఉంటుందని ఎవరూ అధైర్య పడకుండా ముందుకు సాగాలని సిపిఐ ధర్మవరం డివిజన్ కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. బత్తలపల్లి లోని ధర్మవరం రోడ్డుకు ఉన్న సర్వే నెంబర్ 401లో 19.84ఎకరాల భూమిలో గురువారం సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాట కార్యక్రమాన్ని నిర్వహించి జెండాలు నాటారు. శుక్రవారం స్థానిక ప్రజలతో మధు కలిసి మాట్లాడుతూ ఈ భూమి నిడిమామిడి మఠానికి చెందిందని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు. అయితే వాటికి అడ్డుకట్టు వేసి ప్రతి పేదకు అందే విధంగా చూస్తామన్నారు. అయితే బయట వ్యక్తులు మీకు లేనిపోని మాటలు చెబుతారని కానీ ఎవరూ కూడా ఇతరులు మాటలు విని అధైర్య పడకుండా ఉండాలని మీ వెంట మేముంటామని భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకోవాలని చూశారన్నారు. అయితే ఇందుకు కూడా కొందరు అధికారులు సహకరించడం దురదృష్టకరమని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని పేదలకు ఇంటి పట్టాలు ఇస్తూ వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ భూమిలో గుడిసెలు వేసి భూ పోరాటంలో భాగంగా పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటారన్నారు. మఠం భూమి అన్యాక్రాంతం కాకుండా కేవలం పేదలకే దక్కే విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని వీటితో ఎంత దూరానికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే రెవెన్యూ రికార్డుల ఆధారంగా మఠానికి చెందిన వారితో కూడా సంప్రదించామని వారు కూడా సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు భూ పంపిణీ చేస్తే అభ్యంతరం లేదని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలోనే ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాందే విధంగా చేస్తామని పేర్కొన్నారు.మండల కార్యదర్శి బండల వెంకటేష్,రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుళ్లాయప్ప,
సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవి,
. సహాయ కార్యదర్శి
యర్రంశెట్టి రమణ,
చేనేత కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటనారాయణ, వెంకటస్వామి,
బత్తలపల్లి సిపిఐ నాయకులు సత్యామయ్య, రామకృష్ణ, సత్యనారాయణ, అదేప్ప, నాగభూషణ, పి నారాయణ, ఏ నారాయణ, వెంకటప్ప, రామప్ప, జి సూర్యనారాయణ, డి రాజా, ఎస్ వెంకటనారాయణ, డి రామాంజి,డి రమణయ్య,ఎమ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.