Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

మార్పు మన పాటనే ఆర్డిటి విడుదల

విశాలాంధ్ర- జె ఎన్ టి యు ఏ: స్త్రీ సాధికారతపై నిర్మించిన ఈ గీతాన్ని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్ డి టి ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ విడుదల చేశారు.గాయకులు గీత మాధురి, రామ్ మిరియాల, సమీరా భరద్వాజ్, ఇంద్రావతి చౌహాన్, , అదితి భావరాజు ఈ గీతాన్ని ఆలపించారు. ఆర్డీటీ, తమ స్త్రీ శక్తీ ప్రాజెక్ట్ భాగంగా ‘నేనూ శక్తిని’ అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రముఖ గాయిని గాయకులతో మార్పు మనమే అనే గీతాన్ని నిర్మించారు. ఈ గీతం స్త్రీ సాధికారత, మహిళా అభివృద్ధి, మహిళల అవకాశాలు, , వారిలో సాధించగల సామర్థ్యం గురించి మాట్లాడుతుంది.
ఈ గీతాన్ని శుక్రవారం మధ్యాహ్నం ఆర్డీటీ మెయిన్ ఆఫీస్లో ఇతర డైరెక్టర్ల సమక్షంలో ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ విడుదల చేశారు. అనంతరం ఈ పాట గురించి మాట్లాడుతూ, “సంగీతం మరియు సాహిత్యనికి మనసులను కదలించే శక్తి ఉందన్నారు. పాటలు సమాజ అభివృద్ధికి సంబంధించి సందేశాన్ని తెలియజేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అని పేర్కొన్నారు. ఆర్డీటీ నుంచి మహిళలపై ఇటువంటి మంచి పాటను విడుదల చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీటీ మహిళా సాధికారత డైరెక్టర్ వీశా ఫెర్రర్, చైర్ పర్సన్ తిప్పేస్వామి, మరియు ఇతర డైరెక్టర్లు రాజశేఖర్ రెడ్డి, లీల సుజిత్, జులేఖ, కృష్ణవేణి, సాయి కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img