విశాలాంధ్ర – ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది జూకూరు సుమలత గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిని కొనసాగిస్తోంది. న్యాయవాది వృత్తితో పాటు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ లీగల్ అడ్వైజర్ గా పలు సమస్యలను పరిష్కరిస్తూ మంచి గుర్తింపు పొందడం జరిగింది. అదేవిధంగా బొగ్గారపు జగదీష్ బాబు ద్వారా పౌరులకు సామాజిక సేవ అందించడం జరిగింది. గత 12 సంవత్సరాలుగా సుమలత సేవలను గుర్తించిన అంతర్జాతీయ మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అడ్వకేట్ చక్రవర్తి గౌరవ డాక్టరేట్కు ఆమెను ఎంపిక చేశారు. ఈనెల 11వ తేదీ గురువారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ చేతులమీదుగా వీరు గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దంపతులు జగదీష్ బాబు సుమలత మాట్లాడుతూ సమాజ సేవ చేస్తూ వివిధ రంగాల్లో మంచి ప్రావీణ్యం కలిగిన వారికి, మానవత్వం, శాంతియుత, మానవ హక్కుల కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు. తమకు గౌరవప్రదమైన ప్రశంసా పత్ర పురస్కారం అవార్డును పొందడం మాకెంతో సంతోషంగా ఉందని, ఈ డాట్ రేట్ అవార్డు మాకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. పొద్దుటూరు అడ్వకేట్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ కే.చక్రవర్తి మనం ఫౌండేషన్ వారి ద్వారా ఈ అవార్డు అందుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలందరికీ న్యాయం జరిగేందుకు తమ వంతు కృషి చేస్తానని దంపతులు పేర్కొన్నారు.