Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

బొమ్మనహల్ రైతన్నలను ఆదుకోండి

పంట పొలాలపై వచ్చు కాలుష్య నివారణ పై చర్యలు తీసుకోవాలి…

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం : బొమ్మనల్ మండలంలో నేమ్ కల్, హిరిదే హాల్ మధ్య 20 సంవత్సరాలుగా వెలసిన జేఆర్ఎస్ మెటల్స్ పరిశ్రమ,రామాంజనేయ రావు స్టీల్ ప్లాంట్, ఎస్ ఎల్ వి స్టీల్ ప్లాంట్, ఇలా 5. స్పాంజ్ ఐరన్ పరిశ్రమల వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని బొమ్మనహల్ మండలం, నేమకల్ సిపిఐ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి. మల్లికార్జున ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ…ఆ పరిశ్రమలు కూడా ప్రభుత్వ నిబంధనలు సరిగా పాటించడం లేదన్నారు . ఈ ఎస్ పి రన్ చేయడం లేదని, ప్లాంటేషన్, సీసీ రోడ్లు, బ్యాక్ ఫిల్టర్ పని చేయడం లేదన్నారు. ప్రథమ చికిత్స లేకపోగా అంబులెన్స్ సర్వీస్ కూడా కరువైందన్నారు . ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ నిబంధనలను అమలు చేయకుండా పరిశ్రమలు నడుపుకుంటున్నారన్నారు. ఆ పరిశ్రమల నుంచి వచ్చు దుమ్ము, ధూళి వల్ల గ్రామాల్లో చర్మవ్యాధులు, ఆస్మా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. కాలుష్యం గ్రామానికి గాని, పొలాలకు గాని దుమ్ము ధూళి రాకుండా వారు నిబంధనలు పాటించి పరిశ్రమలు నడిపితే ఎవరు ఏమి వ్యతిరేకం కాదు. కావున ప్రస్తుత పరిస్థితులు రైతు కష్టాలలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరిశ్రమల యాజమాన్యం చొరవ తీసుకొని ప్రతి రైతుకు పంట నష్టపరిహారం కింద వారికి ఏమోతాదులో నష్టపోతున్నారో అంచనా వేసి ప్రభుత్వ నిబంధనలు పాటించి రైతులకు అందరికీ న్యాయం పరిశ్రమల వల్ల వచ్చు కాలుష్యం వల్ల దుమ్ము ధూళి వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిని ఇబ్బంది పడుతున్నారన్నారు . కానీ పరిశ్రమల యాజమాన్యం మాత్రం పంట నష్టపరిహారం కింద కొంతమందికి ఎకరాకు 1800, నుంచి 2600 రూపాయల వరకు ఇస్తున్నారు. .అది కూడా మూడు సంవత్సరముల నుండి మాత్రమే అన్ని పరిశ్రమల నుండి వారిచ్చే పంట నష్టపరిహారం రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. విత్తనాలు, ఎరువులు, మందులు ఇలా అనేక రకాలుగా ఎకరాకు 30 వేల నుండి 50 వేల వరకు ఖర్చు పెడుతున్నారు. ప్రధానంగా ఆ పొలాల రైతులు మొక్కజొన్న, సన్ఫ్లవర్, కాటన్, వేరుశనగ, బోరుబావు పంటలు కాయగూరలు తదితర పంటలు పెట్టి జీవనం సాగించుకునే పరిస్థితి రైతన్నదన్నారు. కనీసం ఇప్పటి పరిస్థితుల్లో ఎకరాకు 30 వేల నుండి 40 వేల రూపాయలు పంట నష్టపరిహారం కింద ఫ్యాక్టరీల యాజమాన్యం చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. పరిశ్రమల యజమానులు గుజరాత్, తమిళనాడు, రాష్ట్రాల నుండివచ్చి ఇక్కడ చౌకగా భూములు కొనుగోలు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని పరిశ్రమలు నడుపుకుంటూలాభాలు గడిస్తున్నారన్నారు. రైతులకు మాత్రం తీవ్రమైన అన్యాయం జరుగుతోందన్నారు. పరిశ్రమలకు వ్యతిరేకం కాదని పరిశ్రమలు నడుపుకుంటే సంతోషమే కొంతమందికి ఉపాధి కూడా దొరుకుతుంది అని పేర్కొన్నారు. రైతులకు తగినంత పంట నష్టపరిహారం అందించి రైతుల స్థితిగతులను ఆలోచించి రైతన్నలకు నష్టం వాటిల్లకుండా పరిశ్రమ యాజమాన్యం చొరవ తీసుకోవాలన్నారు. ఇప్పటికే రైతులు అప్పులు పాలై పెట్టుబడులు పెట్టలేక, పెట్టిన పంటలు చేతికి రాక చాలా
ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ పి. రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమణయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి, బొమ్మనహల్, నేమకల్లు సిపిఐ రైతు సంఘం నాయకులు నాగార్జున,తిప్పేస్వామి, మల్లప్ప, పకీరప్ప, రామాంజనేయులు, ప్రశాంత్, గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img