విశాలాంధ్ర- చిలమత్తూర్ రూరల్ : మండల పరిధిలోని, కోడూరు పంచాయతీ కోడికొండ చెక్ పోస్ట్ జాతీయ రహదారి ప్రక్కనే వ్యర్థ పదార్థాలు కుప్పలుగా వేయడంతో దుర్వాసన వెదజల్లుతున్నది, ఈ తరుణంలో వాహనదారులు ,పాదచారులు ఆ వ్యక్తపదార్థాలలో నుండి దుర్వాసన రావడంతో ముక్కున వేలు వేసుకోక తప్పడం లేదు, ఈ తతంగాన్ని చూసిన సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు శుభ్రం చేయడంలో విఫలమవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు, ఆ వ్యక్తపదార్థాలలో ప్రజలకు హాని చేసే క్రిమి కీటకాలు ప్రబలతు సీజనల్ వ్యాధులు ప్రజలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు మరింత రోగాలు బారిన పడే అవకాశాలు ఉన్నాయని మేధావులు చర్చించుకుంటున్నారు, ఏది ఏమైనాప్పటికీ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెక్ పోస్ట్ రహదారి ఇరువైపులా చెత్తాచెదారం ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించే విధముగా అక్కడికి ప్రజలకు దుకాణదారులకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.