Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

గెడ్డలో ఫార్మా వ్యర్ధాల తొలగింపు

విశాలాంధ్ర – పరవాడ(అనకాపల్లి జిల్లా); పెదమొల్లోడు గెడ్డలోని ఫార్మా వ్యర్ధ రసాయన జలాలను ఎట్టకేలకు రాంకీ యాజమాన్యం మంగళవారం తొలగింపు చర్యలు చేపట్టింది. పరవాడ..భరణికం గ్రామాల మధ్యలో ఉన్న మొల్లోడు గెడ్డలో రాంకీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా వ్యర్థ రసాయనాలను విడుదల చేయడంపై భరిణికం గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అలాగే దీనిపై సోమవారం జిల్లా కలెక్టర్‌కి కూడా పిర్యాదు చేసారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్‌ ఈ వ్యర్ధ జలాలను వెంటనే ట్రీట్మెంట్‌ ప్లాంట్‌కి తరలించాలని రాంకీ యాజమాన్యాకికి ఆదేశించారు. దీంతో పీసీబీ అధికారుల పర్యవేక్షణలో వ్యర్ధ జలాలను ట్యాంకర్ల ద్వారా రాంకీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. గ్రామస్తుల పిర్యాదుల నేపద్యంలో ఇప్పటికే ఫార్మా పరిశ్రమ యాజమాన్యాలకి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే కాలుష్యానికి గురైన ఈ ప్రాంతాన్ని కాపాడాలని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, భరణికం మాజీ సర్పంచ్‌ బొండా తాతారావు, పెద్దిశెట్టి వెంకటసత్యారావు, బొండా సత్యారావు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img