Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

త్యాగనిరతికి, సహనానికి ప్రతీక మొహర్రం

త్యాగనిరతికి, సహనానికి ప్రతీక మొహర్రం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

విశాలాంధ్ర – అనంతపురం : త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక! అని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ నియోజకవర్గ ప్రజలకు ఆయన మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా మొహర్రం జరుపుకుంటారన్నారు. మహ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి మొహర్రం ప్రతీకగా పేర్కొన్నారు. ఇస్లామిక్‌ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహర్రం అని పేర్కొన్నారు. ఈ పవిత్ర సంతాప దినాలు మత సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయన్నారు. ధర్మ పరిరక్షణ కోసం సమాజానికి అండగా నిలిచేందుకు హుస్సేన్ త్యాగస్ఫూర్తిని అందుకుందామని పిలుపునిచ్చారు. ముస్లింలు, హిందువులూ కలిసి నిర్వహించే ‘పీర్ల’ ఊరేగింపు ప్రజల మధ్య సఖ్యతను, ఐక్యతను తెలియజేస్తుందన్నారు. ప్రజలంతా పోలీసు వారు సూచించిన నిబంధనల మేరకు శాంతియుత వాతావరణంలో మొహర్రం జరుపుకుందామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img