Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేర్చాలి: రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్

12వ పిఆర్సి (ఐ ఆర్ ) ను ప్రకటించాలి
3 మూడు నుండి ఐదు వరకు పాఠశాల విలీనాని రద్దు చేయాలి
ప్రభుత్వ పాఠశాలలకే తల్లికి వందనం అమలు

విశాలాంధ్ర- జేఎన్టీయూ ఏ: ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆశయ ఆకాంక్షలను నెరవేర్చాలని నూతన కూటమి ప్రభుత్వాన్ని ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ కోరారు. బుధవారం అనంతపురం పట్టణంలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో సిపిఐ కార్యాలయంలో ఎస్ టి యు అనంతపురం జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై చర్చలతో శాశ్విత పరిష్కార మార్గాలను చూపాలన్నారు. 12వ పిఆర్సి మద్యంతర భృతి ఐఆర్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎన్ రమణారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగులకు రివర్స్ పిఆర్సి రూపంలో చేదు గుళికలను అందించిందని, వేల కోట్ల రూపాయలు బకాయిలతో ఉద్యోగులను బాధించి మానసికంగా , ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. సమస్యలపై ఉద్యమిస్తే నోటీసులు, అరెస్టులతో కాలం గడిపింది.. ఉద్యోగ సంఘాలకు గత ప్రభుత్వం గుర్తింపును ఇవ్వకుండా నిర్లక్ష్యపు వైఖరికి నిదర్శనంగా నిలవడంతోనే నేడు కూటమి ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు, ప్రజలు ఎన్నుకున్నారన్నారు. ఏపీ జి ఎల్ ఐ ఫైనల్ పేమెంట్, మెచ్యూరిటీ బాండ్స్ ను సమస్యలను త్వరితగతిన చెల్లించిన ఆర్థిక శాఖను ఆదేశించాలని కోరారు. పురపాలక, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, జిపిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి.. జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని, రాష్ట్రంలో 13 వేల పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయారని, 3,4,5 తరగతిలో విలీలని రద్దుచేసి ప్రతి తరగతికి ఉపాధ్యాయుని కేటాయించి.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి అన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు వర్తింపజేయాలని కోరారు. 1998, 2008 డిఎస్సి ఎంటిఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవి వివరమున వయసు రెగ్యులర్ ప్రాతిపదికన నియామకం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్ రామాంజనేయులు,ఆర్థిక కార్యదర్శి జి.ప్రసాద్, జిల్లా ఇన్ చార్జీ సి.నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.సూర్యుడు, కె.చంద్ర శేఖర్, సి.పి.ఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సీనియర్ నాయకులు గోవిందు, శివయ్య చారి, మాజీ అధ్యక్షులు రామన్న, గోవిందు సిపిఐ నాయకులు నారాయణస్వామి, రాజారెడ్డి, రాజేష్ ఎస్ టి యు రాష్ట్ర కౌన్సిలర్స్ సురేష్ కుమార్, కృష్ణ మోహన్, ఫణి భూషణ్, మల్లికార్జున గౌడ్, ఆనంద్ రెడ్డి సత్య సాయి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ జిల్లా నాయకులు నాగభూషణ సిపిఎస్ రవి పరమేశ్వర్ రెడ్డి, శంకరయ్య బాబ్జి నాయక్, రవికుమార్, మురళీకృష్ణ, ప్రభాకర్, విరుపాక్షి గౌడ్ నరసింహులు సురేష్ కుమార్ , రాష్ట్ర, జిల్లా, మండల ఉపాధ్యాయులు సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img