Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

వైసిపి చేసిన భూదందాల, సహజ వనరుల దోపిడీ గురించి ప్రజలకు తెలియాలి

కొండల్ని మింగిన అనకొండ జగన్ రెడ్డి
జగన్ రెడ్డి తన తాత జాగీరులా దోచుకున్నాడు ఎమ్మెల్యే దగ్గుపాటి

విశాలాంధ్ర – అనంతపురం : ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన భూతంధాలు సహజ వనరుల దోపిడీ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ అన్నారు. అనంతపురం జిల్లా టిడిపి కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు గురించి ప్రజలంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే శ్వేత పత్రం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వివరాలు వెల్లడిస్తున్నారని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణలు జరిగాయని.. వాటి విలువ రూ.35,576 కోట్లు పైనే ఉంటుందన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో 10 వేల ఎకరాలు, ఇసుక దందాలో రూ.9,750 కోట్ల దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో 512ను తమ ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ తెలిపారు. కానీ నల్ల చట్టంలోని లొసుగులను గ్రహించిన జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో 512ను జారీ చేసి అక్రమాలను సక్రమంగా మార్చే ఆయుధంగా నల్లచట్టాన్ని వాడుకున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ధ్వజమెత్తారు. రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టి ప్రజా ధనాన్ని వృధా చేశారని.. భూహక్కు పత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారని విమర్శలు చేశారు. భూముల రీసర్వే పేరుతో పాస్ బుక్ పై జగన్ చిత్రంముద్రించుకోవడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం రెండేసి ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజుకు ఇచ్చుకున్నారని.. మొత్తం రూ.3 వందల కోట్ల విలువైన భూమిని కేటాయించుకున్నారని.. జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ అన్నారు. కొండలను సైతం జగన్ రెడ్డి ప్రభుత్వం అనకొండల్లా మింగేసి గుండులు కొట్టేశారని ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని తన తాత జాగీరులా దోపిడీ చేశారని దీనిపై కచ్చితంగా విచారణ చేసి.. ప్రతి ఎకరాను రికవరీ చేస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. వైసీపీ చేసిన అక్రమాలన్నీ సాక్షదారులతో సహా శ్వేత పత్రం ద్వారా విడుదల చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కూచి హరి, బలిజ సంఘం నాయకుడు రాయల్ మధు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img