: ఏడీఏ రవికుమార్
విశాలాంధ్ర-రాప్తాడు : ప్రస్తుత ఖరీఫ్ సీజనులో రైతులు సాగు చేసిన పంటలకు చీడపీడలు ఆశించకుండా నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ఏడీ రవికుమార్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో రాప్తాడు ఏఓ బీఆర్ శేఖర్ రెడ్డితో కలిసి గురువారం ఆయన సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మండలంలో ఎవరైనా భూములను కౌలు చేస్తున్న రైతులు ఉంటే వీఆర్ఓ, రైతు సేవా కేంద్రం సిబ్బందికి తెలియజేసి కవులు రైతు పత్రం పొందవచ్చన్నారు. ఖరీఫ్ -2024 కి సంబంధించి రైతు సేవా కేంద్రాల వారీగా ఏ పంపిణీ చేసే ఎరువుల వివరాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసే పీఎం కిసాన్ కు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తీ చేయాలన్నారు. మండలంలో భూసార పరీక్షలు త్వరితగతిన పూర్తీ చేసి మట్టి నమూనాలు భూసార పరీక్ష కేంద్రాలకు చేర్చాలన్నారు. ఈకార్యక్రమంలో ఏఈఓ రంజిత, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.