జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర -అనంతపురం : అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. గురువారం అనంతపురంలోని రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో రక్తదాన శిబిరంను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా సంవత్సరంలో ఒకసారైనా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగం కావాలని ఆకాంక్షించారు. తరచుగా రక్తదాన శిబిరములు నిర్వహించటమే కాక అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న రైపర్ మేనేజ్మెంట్, సిబ్బంది, విద్యార్దులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రక్తదానం చేశారు. జెసి నిస్వార్థ చర్య ఇన్స్టిట్యూట్ యొక్క అధ్యాపకులు మరియు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపింది. అలాగే విద్యార్థులు, సమీప గ్రామాల ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వై.పద్మనాభ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రారెడ్డి, అకడమిక్ డైరెక్టర్ డా.ఉమామహేశ్వర్ రావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా.వినోద్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.బి.నాగశుభ, డా.యు.వీరేంద్ర, మరియు మహిళా సాధికారత సెల్ కోఆర్డినేటర్ త్రివేణి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్ పర్సన్ కె.భారతి, సెక్రటరీ మోహన్ కృష్ణ మరియు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత బిసతి భరత్, మారుతి, కిరణ్ సాయి తదితర యువ సామాజిక వేత్తలను అభినందించారు.