Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

ప‌దోత‌ర‌గ‌తి నుంచే మ‌ద్య‌పానం.. ప్రాణాల మీద‌కు తెచ్చిన వైనం

ఈ అల‌వాటుతో కుళ్లిపోయిన పాంక్రియాస్‌
కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రిలో సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌
పూర్తిగా కోలుకున్న యువ‌కుడు

విశాలాంధ్ర -అనంతపురం : ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే స‌మ‌యం నుంచే ఉన్న మ‌ద్య‌పానం అల‌వాటు.. ఓ యువ‌కుడి ప్రాణాల మీద‌కు తీసుకొచ్చింది. 16 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్ప‌టి నుంచి మ‌ద్య‌పానం అల‌వాటైపోయిన ఓ యువ‌కుడికి.. దాని కార‌ణంగా పాంక్రియాస్ (క్లోమం) బాగా పాడైపోయి, కుళ్లిపోయిన స్థితికి చేరుకోవ‌డంతో ప్రాణాపాయం ఏర్ప‌డింది. ఇన్ఫెక్ష‌న్ తీవ్ర‌స్థాయిలో వ్యాపించ‌డంతో శ‌స్త్రచికిత్స చేసినా బ‌తికే అవ‌కాశాలు దాదాపు లేవ‌నే బెంగ‌ళూరులోని ప‌లు ఆస్ప‌త్రుల వైద్యులు అస‌లు కేసు తీసుకునేందుకే ఇష్ట‌ప‌డ‌లేదు. అలాంటి కేసులో అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రి వైద్యులు అత్యంత సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స చేయ‌డ‌మే కాక‌.. రోగి ప్రాణాల‌ను విజ‌య‌వంతంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు డాక్ట‌ర్ ఎన్.మ‌హ్మ‌ద్ షాహిద్ తెలిపారు.
ఈ శ‌స్త్రచికిత్స త‌ర్వాత లోకేష్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే, పాంక్రియాస్‌ను తొల‌గించ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో అత‌డికి క‌చ్చితంగా మ‌ధుమేహం వ‌స్తుంది. ఇన్ఫెక్ష‌న్లు వ్యాపించే ప్ర‌మాదం కూడా ఉంటుంది. మ‌ధుమేహ నియంత్ర‌ణ‌కు టాబ్లెట్లు గానీ, ఇన్సులిన్ గానీ వాడాల్సి ఉంటుంది. మ‌ద్య‌పానానికి పూర్తిగా దూరం కావాలి. ఇన్ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి” అని డాక్ట‌ర్ మ‌హ్మ‌ద్ షాహిద్ వివ‌రించారు.
హైద‌రాబాద్, బెంగ‌ళూరు లాంటి పెద్ద న‌గ‌రాల్లో ఇలాంటి శస్త్రచికిత్స‌ల‌కు దాదాపు రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. దీన్ని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రిలో కేవ‌లం రూ.2ల‌క్ష‌ల‌కే చేశారు. ఇలాంటి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడినందుకు డాక్ట‌ర్ మ‌హ్మ‌ద్ షాహిద్‌కు, కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రి యాజ‌మాన్యానికి లోకేష్‌, అత‌డి త‌ల్లిదండ్రులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img