Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

విద్యార్థులు స్ఫూర్తి దాయకంగా ఉండాలి

విశాలాంధ్ర- కర్నూలు సిటీ: ప్రతి ఒక్కరు ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకులను స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని ఎన్ సిసి కమాండింగ్ ఆఫీసర్ జోబీ ఫిలిప్స్ సూచించారు. బుధవారం మాధవనగర్ లోని నారాయణ పాఠశాలలో ఏజీఎం రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆల్తాఫ్ అధ్వర్యంలో విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథిగా హాజరైన జోబీ ఫిలిప్ జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్నికల ప్రక్రియ, నాయకత్వ లక్షణాలు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయని, వాటిని తరుచుగా బహిర్గతం చేయాలన్నారు. పిల్లల బలాలు బలహీనతలపై తల్లిదండ్రులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు.నాయకత్వానికి జరిపిన మాక్ ఎలక్షన్స్ లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి బ్యాడ్జిలు అందజేశారు. స్కూల్ స్పెషల్ లీడర్ ఎన్నిక కొరకై హెడ్ బాయ్, హెడ్ గర్ల్తో విభాగాల్లో సీనియర్, జూనియర్ లకు అగ్ని, త్రిషుల్, నాగ్, పృధ్వీ కేటగిరిలకు ఎన్నికైన విద్యార్ధులను అతిథి అభినందించారు.కార్యక్రమంలో అకడమిక్ డీన్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వరీ, రాధ, సాఫ్ట్ స్కిల్ టీచర్ నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img