Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

చట్ట పరిధిలో గ్రామ ప్రజలు జీవించాలి.. రూరల్ ఎస్సై శ్రీనివాసులు

విశాలాంధ్ర -ధర్మవరం:: గ్రామ ప్రజలందరూ కూడా చట్టపరిధిలోనే జీవించాలని, అప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. అనంతరం వారు సిబ్బందితోపాటు మండల పరిధిలోని పోతుల నాగేపల్లిలో గ్రామసభను ఏర్పాటు చేశారు. తదుపరి అక్కడి గ్రామ ప్రజలకు చట్టం పై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గొడవలకు దూరంగా ఉండాలని మధ్యానికి బానిస అవుతే కుటుంబం నాశనం అవుతుందని తెలిపారు. సైబర్ క్రైమ్ పైన కూడా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. చిన్నపాటి గొడవలకు కోర్టులకు ఎక్కొద్దని, సహనముతో సమస్యను పరిష్కరిస్తే తప్పక విజయం సాధిస్తారని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరగరాదని, నాటు సారా చేయరాదని, అక్రమంగా మద్యం విక్రయించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img