Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

చెస్ లో డిగ్రీ కళాశాల విద్యార్థి ఎం.రాజు ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం;; సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ (శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ) పోటీలకు ధర్మవరంలోని కే హెచ్ డిగ్రీ కళాశాలలో బీకాం మూడవ సంవత్సరం చదువుతున్న ఎం. రాజు బి ఎస్ కే చెస్లో చక్కటి ప్రతిభ కనబరచడం జరిగిందని చెస్ కోచ్ ఆది రత్న కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం నందుగల ఆర్ట్స్ కాలేజీలో ఈనెల 26వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగిన చెస్ పోటీలలో ఎం రాజు అను విద్యార్థి పాల్గొని ఐదు మ్యాచ్లకు గాను నాలుగు మ్యాచ్లు గెలిచి నాలుగవ స్థానంలో పొందడం జరిగిందని తెలిపారు. తదుపరి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుండి చెన్నైలోని వెల్టెక్ యూనివర్సిటీలో మళ్లీ నెలలో జరగబోవు పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ధర్మవరంలో కేహెచ్ డిగ్రీ కళాశాలలో బిఎస్కే చెస్ అకాడమీలో చెస్ శిక్షణ పొందుతూ ఇలాగా ప్రతిభా కనబరచడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.ఈ సందర్భంగా చెస్ కోచ్ ఆదిరత్నకుమార్ తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, అధ్యాపకులు ,బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img