విశాలాంధ్ర- తనకల్లు : సత్యసాయి జిల్లాలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా తనకల్లు మండలానికి చెందిన చెరుకూరి గంగులయ్య ఎంపికయ్యారు జిల్లావ్యాప్తంగా మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా అందులో ఈయన ఒకడుగా ఉన్నారు. ఈ ఉత్తర్వులను సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ (ఎన్జీవో) కింద ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు సేవ చేయడం బాధ్యతగా తీసుకొని (ూూA1989) సమస్యలపై నిరంతరం కృషిచేసి సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుతానన్నారు. గత ఐదేళ్లు ఈ పదవిలో కొనసాగినానని ఇప్పుడు మరీ ఎంపిక చేసి ఇంత పెద్ద బాధ్యతను కల్పించిన కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.