విశాలాంధ్ర ధర్మవరం : అనంతపురం జిల్లాలో ఈ నెల 28వ తేదీన ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ధర్మవరం పట్టణంలోని జీవన్ జ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థినీలు ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి అండర్ 17 టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ సిస్టర్ సుజాత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాల ద్వారా 9వ తరగతి చదువుతున్న సి.వైష్ణవి, 8వ తరగతి చదువుతున్న ఎస్. ఐశ్వర్య లు టేబుల్ టెన్నిస్లో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడల పట్ల కూడా ప్రతిరోజు అభ్యాసాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపికైన ఈ విద్యార్థినీలు నవంబర్ మూడవ తేదీ నుంచి 5వ తేదీ వరకు కర్నూలు జిల్లాలోని నంద్యాల డిఎస్ఏ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. తదుపరి హెడ్ మిస్టర్ సిస్టర్ సుజాత తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం, బోధనేతర బృందం ,తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.