Friday, May 17, 2024
Friday, May 17, 2024

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం

సిపిఎం చింతపల్లి మండల ప్రధాన కార్యదర్శి పాంగి ధనుంజయ్

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా): -ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అరకు పార్లమెంట్ కాంగ్రెస్, పాడేరు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మండలంలోని అన్నవరం వారపు సంతలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్ ఆధ్వర్యంలో సోమవారం జోరుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ధనుంజయ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న బిజెపి రానున్న ఎన్నికల్లో బిజెపి కి 400 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటున్నారని, దేశానికి ఇది ఎంత ప్రమాదకరమోనని ప్రజలు గమనించాలన్నారు. ముఖ్యంగా దేశంలోని షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు అత్యంత నష్టదాయకమన్నారు. ఇప్పటికే ఉన్న చట్టాలు అమలు చేయక పోవడమే కాకుండా గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన చట్టాల్ని నిర్వీర్యం చేస్తూ సవరణలు చేశారని, ఒకపక్క అటవీ సంరక్షణ చట్టం సవరణ చేసి దేశంలోని అటవీ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కుట్రలు చేస్తున్నారని, మరోపక్క జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దుచేసిన తర్వాత దాని పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస ప్రయత్నం చేయకుండా గిరిజన నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వాలని ఇప్పటిదాకా ఉన్న గిరిజన ప్రాంత ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో కనీసం మాట్లాడకపోవడం దారుణమన్నారు. గిరిజన ప్రాంత చట్టాలు, హక్కులు కాపాడుకోవాలన్న, ఉద్యోగ రిజర్వేషన్ కై పోరాడి సాధించుకోవాలన్నా ఇండియా కూటమి బలపరిచిన అరకు పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స ను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై, సీపీఎం, సీపీఐ కూటమి బలపర్చిన పాడేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి శతక బుల్లిబాబు ను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఓటరులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సాగిన చిరంజీవి పాంగి జీవన్ కృష్ణ సీదరి సత్తిబాబు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img