Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

దోమతెరలు వినియోగిద్దాం … మలేరియా వ్యాధిని నిర్మూలిద్దాం

ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటిద్దాం

చింతపల్లి ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ చంద్రశేఖర్

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – మలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ విధిగా దోమతెరలను వినియోగించాలని స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ చంద్రశేఖర్ అన్నారు. మలేరియా వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ఏరియా ఆసుపత్రి వద్ద సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధి నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. సీలేరు, చింతపల్లి సబ్ యూనిట్ అధికారులు ఆర్ కన్నబాబు, బి చిట్టిబాబు ల పర్యవేక్షణలో స్థానిక ఏరియా ఆసుపత్రి నుంచి అంబేద్కర్ కూడలి వరకు వైద్యారోగ్య సిబ్బందితో వచ్చిన వారు మానవహారం నిర్వహించి అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. వేపాకు పొగ.. దోమలకు సెగ, దోమ పుట్టరాదు.. దోమ కుట్టరాదు, దోమల నియంత్రణ మన అందరి బాధ్యత, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి, దోమల వ్యాప్తిని అరికట్టండి, మలేరియా రహిత సమాజమే మన లక్ష్యం, దోమతెరలు వినియోగిద్దాం.. దోమ కాటు నుంచి రక్షణ పొందుదాం అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన రెండు రోజులుగా మన్యంలో కురుస్తున్న చిన్నపాటి వర్షాలు కారణంగా జ్వరాలు ప్రభలే అవకాశాలున్నాయని, దగ్గు జలుబు తలనొప్పి, చలిజ్వరం సంభవిస్తే గ్రామంలోని ఆశ కార్యకర్త, ఏఎన్ఎం ల సహకారంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. చిన్నపాటి జ్వరాలే కదా అని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లె ప్రమాదం ఉందన్నారు. మురుగు నీటి నిల్వలు దోమలకు ఆవాసాలుగా తయారవుతున్నాయన్నారు. దోమల కారణంగా వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మలేరియా మహమ్మారి వ్యాపిస్తుందని, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నిర్మూలనకు ప్రతి కుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆ దోమతెరలను ప్రతి ఒక్కరు విధిగా వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ ఈవో జాన్సన్, మలేరియా సూపర్వైజర్ శ్రావణి సంధ్య, హెల్త్ సూపర్వైజర్ శాంత కుమారి, ఎంఎల్ హెచ్ పి ఈ లక్ష్మి, ఏఎన్ఎం లు కే విజయలక్ష్మి, ఎస్ వరలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్స్ సత్య రావు, లక్ష్మణరావు, ప్రకాష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img