Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

అక్రమ అరెస్టులు గృహనిర్బంధాలు మాని సమస్య పరిష్కారానికి ముందుకు రండి

వైకాపా ప్రభుత్వానికి సూచించిన అఖిలపక్ష నాయకులు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు మాని సమస్య పరిష్కారానికి వైకాపా ప్రభుత్వం ముందుకు రావాలని అంగన్వాడీలకు సంఘీభావంగా చింతపల్లిలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు సోమవారం నిరసన ర్యాలీ చేశాయి. స్థానిక సాయిబాబా ఆలయం నుంచి హనుమాన్ కూడలి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం జరిగిన సభలో సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ 43 రోజులుగా నారీమణులు (అంగన్వాడీలు) నిరవధిక సమ్మె చేస్తున్నా, వైకాపా ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తూ అధికారుల ద్వారా అంగన్వాడీలను ఇబ్బందులకు గురి చేసే ధోరణితోనే ఆలోచన చేస్తుంది తప్ప న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేసే ధోరణి కనబరచడం లేదని మండిపడ్డారు. ఎస్మాను సైతం లెక్కచేయని అంగన్వాడీలపై ఆఖరి అస్త్రంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, నూతనంగా నోటిఫికేషన్ విడుదల చేసి కొత్తవారిని నియమిస్తామని భయపెట్టడం వైకాపా ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆడిన మాట తప్పని వ్యక్తి అయితే ఎన్నికలకు ముందు తాను మాట్లాడిన వీడియోలను ఒకసారి చూసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. మాట ఇచ్చింది ఎవరు, తప్పింది ఎవరు అని ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడం వలననే అంగన్వాడీలలో తిరుగుబాటు వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా భయపెట్టే ధోరణి మానుకోవాలని, లేదంటే ఉద్యోగాన్ని పక్కనపెట్టి, ప్రాణాలైనా ఎదురొడ్డి సామాజికంగా ఉద్యమానికి సిద్ధం కావలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెదేపా అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, చింతపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చే వరకు అంగన్వాడీలకు తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. సిపిఐ పార్టీ ఎర్రబొమ్మలు ఎంపీటీసీ సభ్యుడు సెగ్గే సత్తిబాబు మాట్లాడుతూ ఎర్రజెండా నీడలో ఎన్నో ఉద్యమాలు చేసి న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడం జరిగిందన్నారు. అదే తరహాలో అంగన్వాడీల వెంట మేమున్నామంటూ సిపిఐ పార్టీ గడచిన 43 రోజులుగా అంగన్వాడీల వెంట భరోసాగా నిలిచిందన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు అటు సిపిఎం ఇటు సిపిఐ లతోపాటు తెదేపా కూడా సంఘీభావం తెలియపరచడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సాగిన చిరంజీవి పడాల్, తెదేపా, సిపిఎం, సిపిఐ నాయకులతోపాటు అధిక సంఖ్యలో అంగన్వాడీ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img