Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యం

తండ్రి దివంగత నాగేశ్వరరావు జ్ఞ్యాపకార్థం యేర్పాటు చేసిన చలి వేంద్రం

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో ఉన్న ప్రజలకే గాక, మండల కేంద్రానికి వచ్చే ప్రజలందరి దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా తమ తండ్రి, టీవీ5 మాజీ రిపోర్టర్ దివంగత పెదిరెడ్ల నాగేశ్వరరావు (కో మో) జ్యాపకార్థంగా ఆయన కుమారులు, గౌతమ్, జస్వంత్, వారి కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని పైడిమాంబ దుకాణ సముదాయ సమీపంలో చలి వేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర రావు కుమారులు మాట్లాడుతూ వేసవి కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మన్యంలో ఎండలు మండుతున్న తరుణంలో గ్రామంలోని ప్రజలే గాక వివిధ అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం తమ తండ్రి నాగేశ్వరరావు తమకు నేర్పాడన్నారు. ఎవరు కష్టాలలో, భాధలలో ఉన్న అక్కడ నాగేశ్వరరావు(కోమో) ఉంటాడు అనే రీతిగా తమ తండ్రి ఉండే వాడన్నారు. ఆయన మరణించి నప్పటికీ ఆయన చూపిన సేవాభావం తమను ప్రజలకు సేవ చేయాలని ప్రేరేపిస్తుందన్నారు. అందులో భాగంగానే తమకు తోచిన రీతిలో ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగు తుందన్నారు. నేడు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, వేసవి కాలం మొత్తం ఈ చలివేంద్రాన్ని కొనసాగిస్తామని, ప్రజలంతా ఈ చలి వేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img