Friday, May 3, 2024
Friday, May 3, 2024

ట్రాఫిక్ పోలీసులకు ఏ.సీ.హెల్మెట్ లు…..

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : తే.20.04.2024ది. ఎండ వేడిమిని తట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీసులకు కొత్త ఏసీ హెల్మెట్‌లు సరఫరా చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త ఏ.సీ.హెల్మెట్లు 40-42 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతల సమయంలో కూడా తమను తాము చల్లబరుచుకోవడానికి ఉపయోగపడుతాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ హెల్మెట్‌లను వివిధ ప్రత్యేకతలతో తయారు చేస్తున్నారు. ఎండ వేడిమి నుంచి కళ్లు, తలను కాపాడుకునేందుకు పోలీసులకు ఈ హెల్మెట్లు దోహదపడుతాయి.
ఈ హెల్మెట్ కు ఛార్జింగ్ పాయింట్‌ కూడా కలిగి ఉంటుంది. పూర్తి ఛార్జ్‌తో ఈ హెల్మెట్‌లు పోలీసులకు నాన్ స్టాప్ గా సుమారు ఎనిమిది గంటల వరకు చల్లగా ఉంచగలదని అధికారులు అంటున్నారు. దీంతో ఎండలో నిరంతరాయంగా పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు కొంత ఉపశమనం ఇవ్వగలదని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img